ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీలోని తూర్పు ఇబ్రహీంపట్నంలో సోమవారం, నవంబర్ 3, 2025న శ్రీ మహా గణపతి, దత్తాత్రేయ, శ్రీ సాయిబాబా, శ్రీ శీతలాంబ పరివార సమేత శ్రీ గంగానమ్మ తల్లి నూతన ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. దేవాలయాలు గ్రామాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమైక్యతకు కేంద్రాలని ఆయన అన్నారు. ఈ మహోత్సవంలో స్థానిక ప్రజలు, భక్తులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa