ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌–2025: భారత జట్టు ప్రకటించింది

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 08:49 PM

హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌–2025 (Hong Kong Sixes) టోర్నమెంట్‌కు భారత జట్టు అధికారికంగా ప్రకటించింది. నవంబర్‌ 6 నుంచి 9 వరకు హాంకాంగ్‌లోని మోంగ్‌ కాక్‌ మైదానంలో ఈ టోర్నీ జరగనుంది.భారత్‌కు మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు. డీకేతో పాటు రాబిన్‌ ఊతప్ప, స్టువర్ట్‌ బిన్నీ, అభిమన్యు మిథున్‌, భరత్‌ చిప్లి, షాబాజ్‌ నదీమ్‌, అలాగే వెటరన్‌ క్రికెటర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ ఈ టోర్నీలో పాల్గొననున్నారు.
*టోర్నీ ప్రత్యేకతలు : ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌ టోర్నీలో ఒక్కో జట్టులో ఆరుగురు మాజీ క్రికెటర్లు ఉంటారు. ప్రతి మ్యాచ్‌ ఆరు ఓవర్ల పాటు సాగుతుంది.2005లో భారత్‌ టైటిల్‌ గెలుచుకున్నప్పటికీ, రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది. గత ఏడాది రాబిన్‌ ఊతప్ప నేతృత్వంలోని జట్టు ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఈసారి కొత్త సారథిగా డీకే బాధ్యతలు చేపట్టడం విశేషం.తాజా ఎడిషన్‌లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.
*హాంకాంగ్‌ సిక్సెస్‌–2025లో పాల్గొనే జట్లు :
-భారత్‌ :దినేశ్‌ కార్తిక్‌ (కెప్టెన్‌), రాబిన్‌ ఊతప్ప, స్టువర్ట్‌ బిన్నీ, అభిమన్యు మిథున్‌, భరత్‌ చిప్లి, షాబాజ్‌ నదీమ్‌, ప్రియాంక్‌ పాంచల్‌.
-ఆస్ట్రేలియా : అలెక్స్‌ రాస్‌ (కెప్టెన్‌), బెన్‌ మెక్‌డెర్మాట్‌, జాక్‌ వుడ్‌, నిక్‌ హోబ్సన్‌, క్రిస్‌ గ్రీన్‌, విల్‌ బొసిస్టో, ఆండ్యూ టై.
-ఇంగ్లండ్‌ : జో డెన్లీ (కెప్టెన్‌), జేమ్స్‌ కోల్స్‌, ఈథన్‌ బ్రూక్స్‌, టోబీ అల్బర్ట్‌, జార్జ్‌ హిల్‌, డాన్‌ మౌస్లే, టామ్‌ అస్పిన్‌వాల్‌.
-బంగ్లాదేశ్‌ : అక్బర్‌ అలీ (కెప్టెన్‌), అబు హైదర్‌ రోని, జిషాన్‌ ఆలం, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌, మొసాడెక్‌ హొసేన్‌, రకీబుల్‌ హసన్‌, టొఫేల్‌ అహ్మద్‌.
-యూఏఈ : కౌశిక్‌ హర్షిత్‌ (కెప్టెన్‌), ఖలీద్‌ షా, ముహమ్మద్‌ అర్ఫాన్‌, ముహమ్మద్‌ ఫారూక్‌, ముహమ్మద్‌ సాగిర్‌ ఖాన్‌, నిలాన్ష్‌ కేస్వాని, రెజిత్‌ కురుంగొడె, జాహిద్‌ అలీ.
-కువైట్‌ : యాసిన్‌ పటేల్‌ (కెప్టెన్‌), ఉస్మాన్‌ పటేల్‌, మీట్‌ భవ్సార్‌, బిలాల్‌ తాహిర్‌, రవిజ్‌ సాండరువాన్‌, అద్నాన్‌ ఇద్రీస్‌, మొహమద్‌ షఫీక్‌.
-నేపాల్‌ : శరద్‌ వేసావ్కర్‌ (కెప్టెన్‌), సందీప్‌ జోరా, లోకేశ్‌ బామ్‌, బాసిర్‌ అహ్మద్‌, ఆదిల్‌ ఆలం‌, రషీద్‌ ఖాన్‌, రూపేశ్‌ సింగ్‌.
-శ్రీలంక : లాహిరు మధుషాంక (కెప్టెన్‌), ధనంజయ లక్షణ్‌, తనుక దబారే, నిమేశ్‌ విముక్తి, లాహిరు సమారకూన్‌, థారిందు రత్నాయక, సచిత్‌ జయతిలకె.
-సౌతాఫ్రికా : జోర్డాన్‌ మోరిస్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా బయోమి, ఈథన్‌ కన్నింగ్‌హామ్‌, బులెలొ దూబే, కషీఫ్‌ జోసెఫ్‌, బ్లేక్‌ సింప్సన్‌, జోరిచ్‌ వాన్‌ షాల్వేక్‌.
-హాంకాంగ్‌ : యాసిమ్‌ ముర్తజా (కెప్టెన్‌), బాబర్‌ హయత్‌, అన్షుమాన్‌ రథ్‌, ఐజాజ్‌ ఖాన్‌, నిజాకత్‌ ఖాన్‌, ఎహ్‌సాన్‌ ఖాన్‌, నస్రుల్లా రాణా.
-అఫ్గనిస్తాన్‌ : గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), ఇక్రామ్‌ అలిఖిల్‌, కరీమ్‌ జన్మత్‌, షరాఫుద్దీన్‌ ఆష్రఫ్‌, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్‌ అహ్మద్‌ అహ్మద్‌జాయ్‌, సెదీకుల్లా పచా.
-పాకిస్తాన్‌ : అబ్బాస్‌ ఆఫ్రిది (కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, ఖవాజా మొహమద్‌ నఫాయ్‌, మాజ్‌ సదాకత్‌, మొహమద్‌ షాజాద్‌, సాద్‌ మసూద్‌, షాహిద్‌ అజీజ్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa