సాధారణంగా మన బాడీలో కొలెస్ట్రాల్ రెండురకాలుగా ఉంటుంది. అవి లో డెన్సిటీ లిపోప్రోటీన్ దీనినే చెడు కొలెస్ట్రాల్ అంటారు. హై డెన్సిటీ లిపోప్రోటీన్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఈ రెండు కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేస్తేనే గుండెకి మంచిది. ఎక్కువ కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరితే ప్లాక్స్‌లా మారిలా ధమనుల్లో పేరుకుపోతుంది. దీనినే అథెరోస్కెరోసిస్ అంటారు. దీని వల్లే కరోనరీ ఆర్టరీ సమస్యలొస్తాయి. దీంతో ధమనులు బ్లాక్ అయిపోతాయి. అలాంటి కొలెస్ట్రాల్‌ని కరిగించాలి. మనం శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్‌ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో పాటు ఎలాంటి వర్కౌట్ చేయకుండా నిశ్చలమైన లైఫ్‌స్టైల్ ఫాలో అయితే మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హై కొలెస్ట్రాల్ ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. దీంతో పాటు గుండె సమస్యలు, హార్ట్ అలాక్స్, స్ట్రోక్స్ వస్తాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గించడం వల్ల ఈ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు కొన్ని ఆకులు హెల్ప్ చేస్తాయి. ఇవి మన డైట్‌లో యాడ్ చేస్తే చాలా మంచిది. అవి.
పుదీనా ఆకులు
పుదీనా ఆకులు వీటిని తీసుకున్నప్పుడు మనం రీఫ్రెష్‌గా ఫీల్ అవుతాం. ఇందులోనూ గొప్ప గుణాలు ఉంటాయి. వీటి కారణంగా జీర్ణ సమస్యలు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మెటబాలిజాన్ని పెంచి ఫ్యాట్‌ని కరిగేలా చేస్తుంది. దీనికోసం పుదీనాని మన డైట్‌లో యాడ్ చేయాలి. లేదా పుదీనాని స్మూతీస్, సలాడ్స్‌లో యాడ్ చేయడం మంచిది.
కరివేపాకు
కరివేపాకులు మన వంటల పోపుల్లో ఎక్కువగా వాడతాం. వీటిలోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా, యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి ఫ్యాట్ అబ్జార్బ్ కాకుండా చేస్తాయి. వీటిని మనం వంటల్లో వాడడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతాం.
మెంతి ఆకులు
మెంతి ఆకుల్ని హై కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఆకులని చెప్పొచ్చు. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. వీటిని మనం కూరల్లో కలిపి తీసుకోవచ్చు. లేదంటే క్యాప్సూల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
వేపాకులు
వేపాకుల్లో డీటాక్సీఫైయింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి మన బ్లడ్‌ని ప్యూరిఫై చేసి లివర్ పనితీరుని మెరుగ్గా చేస్తాయి.అంతకాకుండా కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని కొన్ని గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగిస్తాయి. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. వీటిని మన డైట్‌లో ఏదో రకంగా యాడ్ చేయడం, లేదా క్యాప్సూల్స్‌లా తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి.
తులసి
తులసిలో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అధ్యయనాల ప్రకారం దీనిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. వీటిని సలాడ్స్‌లో వేసి తీసుకోవచ్చు. వీటితో పాటు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు.
ఈ ఆకుల్ని రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా వరకూ మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో పాటు మనం హెల్దీ డైట్ తీసుకోవడం, వర్కౌట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa