ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 01:03 PM

పశ్చిమబెంగాల్ లోని హుగ్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తారకేశ్వర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి చిన్నారి తన అమ్మమ్మ వద్ద నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున బిడ్డ కన్పించకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా.. రైల్వేస్టేషన్ పక్కన ఉన్న డ్రెయిన్లో రక్తపుమడుగులో బాలికను గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa