AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉ.11 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్‌పై చర్చించనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు అప్పగించారు. రాష్ట్రానికి రానున్న రూ.లక్ష కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa