కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), దివ్యకు 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి రక్ష (2) అనే కుమార్తె ఉంది. కేఆర్‌పేట పట్టణంలోని జయనగరలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. అయితే ఏం అయిందో తెలియదు. ఆదివారం రాత్రి కుటుంబం మొత్తం ఒకే తాడుకు ఉరేసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప ప్రాణాలతో బయటపడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa