AP: వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. మేకపాటి ఇటీవల మాట్లాడుతూ, పార్టీలో 'కోటరీ' ఉందని, వారంతా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ, ఆయనకు వాస్తవాలు తెలియనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాతే ఆయన పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తన వ్యాఖ్యలపై కూడా జగన్ నుంచి స్పందన రాకపోవడంతో, ఆయన పార్టీని వీడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa