రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఇకపై పనిదినాల్లో రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతుల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఈ వివరాలను వెల్లడించారు. ఈ చర్య ద్వారా రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa