ఎయిర్‌టెల్ తన అన్‌లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్‌లలో డేటా ప్రయోజనాలను గణనీయంగా తగ్గించింది. ₹51, ₹101, ₹151 ప్యాక్‌లపై గతంలో లభించిన 3GB, 6GB, 9GB డేటా ఇప్పుడు వరుసగా 1GB, 2GB, 3GBకు తగ్గించబడింది. ధరలు మారనప్పటికీ డేటా తగ్గడంతో వినియోగదారులకు నష్టం కలగనుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ప్యాక్‌ల ప్రయోజనాలను కూడా ఇలానే తగ్గించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa