ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిథాలీరాజ్‌ రికార్డ్‌ సమం చేసిన హర్మన్‌ ప్రీత్ కౌర్‌

sports |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 02:39 PM

శ్రీలంకతో మంగళవారం జరిగిన అయిదో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకుని, మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో 68 పరుగులు చేసిన హర్మన్‌, టీమ్‌ఇండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో భారత జట్టు 5-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. హర్మన్‌ తన 187వ టీ20 మ్యాచ్‌లో 12వ సారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోగా, మిథాలీ తన కెరీర్‌లో 89 మ్యాచ్‌లలో 12 సార్లు ఈ ఘనత సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa