బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు (మెక్సికో కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారాజిన్హో సమీపంలో జాతీయ రహదారిపై ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa