Suzuki e-Access: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కూటర్‌కు ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.88 లక్షలుగా నిర్ణయించారు. హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్‌లో దీనిని తయారు చేయనుండగా, ఈ లాంచ్‌తో సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.సుజుకీ e-Access ను అండర్‌బోన్ ఫ్రేమ్‌పై రూపొందించారు. ఇందులో 3.07 kWh సామర్థ్యం గల లిథియమ్ ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అందించారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులోని 4.1 kW ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 15 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పోర్టబుల్ ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 2 గంటల 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.ఫీచర్ల పరంగా e-Access ఆధునిక సాంకేతికతతో ఆకట్టుకుంటుంది. ఇందులో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మూడు రైడింగ్ మోడ్లు — ఎకో, రైడ్ A, రైడ్ B, రెజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అదనంగా బ్లూటూత్ యాప్ కనెక్టివిటీతో పాటు USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు.డిజైన్ విషయానికొస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఆధునిక మరియు స్టైలిష్ లుక్ ఇచ్చారు. LED లైటింగ్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొత్తగా మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ & మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే రంగు ఆప్షన్‌ను పరిచయం చేశారు. మొత్తం నాలుగు కలర్ వేరియంట్స్‌లో e-Access అందుబాటులో ఉండగా, మెటాలిక్ మ్యాట్ బ్లాక్‌తో బోర్డియక్స్ రెడ్, పెర్ల్ గ్రేస్ వైట్‌తో మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే, పెర్ల్ జాడే గ్రీన్‌తో మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే వంటి రంగులు కూడా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa