ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై హరిజన్, గిరిజన్ పదాలు వాడడానికి వీళ్లేదు,,,,,సర్కారు సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 08:35 PM

హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఇకపై అధికారిక పత్రాల్లో, ఉత్తరప్రత్యుత్తరాల్లో, రికార్డుల్లో 'హరిజన్', 'గిరిజన్' అనే పదాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం మంగళవారం అధికారిక ఉత్తర్వులను వెలువరించింది.


రాజ్యాంగబద్ధతకే పెద్దపీట..


భారత రాజ్యాంగంలో ఎక్కడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి 'హరిజన్' లేదా 'గిరిజన్' అనే పదాల ప్రస్తావన లేదని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ పదాల వాడకాన్ని నిలిపివేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ.. కొన్ని విభాగాలు ఇంకా వీటిని ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, బోర్డులు, కార్పొరేషన్లు, యూనివర్సిటీ రిజిస్ట్రార్లు, డివిజనల్ కమిషనర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.


మహాత్మా గాంధీ షెడ్యూల్డ్ కులాల వారిని 'హరిజనులు' (భగవంతుని బిడ్డలు) అని సంబోధించేవారు. అయితే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ పదాన్ని వ్యతిరేకించారు. ఆయన ఈ వర్గాలను దళితులు అని పిలవడానికే మొగ్గు చూపేవారు. సామాజికంగా కొన్ని పదాలు గౌరవప్రదంగా అనిపించినా.. రాజ్యాంగబద్ధంగా గుర్తించిన పదాలనే ప్రభుత్వ రికార్డుల్లో వాడటం సరైనదని కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు గతంలోనే అభిప్రాయం వ్యక్తం చేశాయి.


ఈక్రమంలోనే గెజిట్ నోటిఫికేషన్లు, సర్టిఫికేట్లు, ఇతర ప్రభుత్వ దస్త్రాల్లో ఈ పదాలను తక్షణమే నిలిపివేయాలి హర్యాన సర్కారు అధికారులకు సూచించింది. గతంలో ఇచ్చిన సూచనలను కొన్ని విభాగాలు తుంగలో తొక్కడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇకపై పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa