థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రముఖ మ్యూజిక్ ఈవెంట్ ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్లో పాల్గొన్న 28 ఏళ్ల భారతీయ యువకుడు జైసాక్షమ్ అనుమానాస్పద పరిస్థితులో మృతి చెందాడు. ఫుకెట్‌లో నిర్వహించిన ఈ ఫెస్టివల్‌కు హాజరైన జైసాక్షమ్, కార్యక్రమం ముగిశాక అకస్మాత్తుగా విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తించడంతో అక్కడున్న వారు రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa