ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ 'ఐకాన్ ఆఫ్ ది సీస్' సముద్ర ప్రయాణంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2,48,663 గ్రాస్ టన్నుల బరువున్న ఈ భారీ నౌక, చారిత్రక టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది. ఇందులో గరిష్టంగా 7,600 మంది అతిథులు, 2,350 మంది సిబ్బంది ప్రయాణించే వీలుంది. రాయల్ కరేబియన్ నిర్మించిన ఈ ఓడలో 20 అంతస్తులు, అత్యాధునిక వాటర్ పార్కులు ఉన్నాయి. విలాసవంతమైన సౌకర్యాలతో అద్భుతమైన పర్యాటక అనుభూతిని అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa