78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత.. ఛత్తీస్గఢ్లో బస్తర్ ప్రాంతంలోని 47 గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. మావోయిస్టుల భయం కారణంగా గతంలో జాతీయ జెండా ఎగురవేయడానికి, పండుగలు జరుపుకోవడానికి వీలుకాని ఈ గ్రామాల్లో సోమవారం జరిగిన వేడుకలు చారిత్రాత్మకమైనవి. బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాల పరిధిలోని ఈ గ్రామాల్లో గ్రామస్థులే స్వచ్ఛందంగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గత రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాత్మక చర్యలతో ఈ మార్పు సాధ్యమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa