ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి కీలక ఒప్పందం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 06:35 PM

భారత్‌లో విమానాల తయారీ దిశగా అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రయర్‌ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందానికి సహకరిస్తుందన్నారు. పెరుగుతున్న అవసరాల మేరకు విమానాల తయారీ చేపట్టనున్నామని, ముఖ్యంగా చిన్న, డొమెస్టిక్‌ విమానాలకు మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. దేశంలో టైర్‌ 2, టైర్‌ 3 నగరాల మధ్య విమానయాన అనుసంధానతను పెంచడంలో ఈ ఒప్పందం దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa