ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్ట్ దిశగా ఇస్రో మరింత ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భవిష్యత్తులో మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. దీనికంటే ముందు మూడు మానవరహిత మిషన్లను రూపొందించినట్లు పేర్కొంది. గగన్‌యాన్ మానవరహిత మిషన్ కోసం ఇప్పటికే 8 వేలకుపైగా గ్రౌండ్ టెస్టులు పూర్తిచేశామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. అన్ని వ్యవస్థలను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే మానవసహిత యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa