జనవరిలో దూసుకుపోయిన వెండి, బంగారం ధరలకు బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో విలువైన లోహాల ర్యాలీకి ఆటంకం ఏర్పడింది. ఫిబ్రవరి 1న రూ.3.20 లక్షలు ఉన్న కిలో వెండి ధర, సోమవారం రూ.20 వేలు తగ్గి రూ.3 లక్షలకు చేరుకుంది. స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ధరలు పడిపోవడంతో రిటైల్ షాపుల్లోనూ రేట్లు తగ్గాయి. నిపుణుల అంచనాల ప్రకారం, రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈటీఎఫ్స్, ఫ్యూచర్స్ మార్కెట్లలోనూ భారీ పతనం నమోదైంది.స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ సోమవారం 3 శాతం పడిపోవటంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.లక్షా 43వేల 335గా ఉంది. అలాగా జూన్, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 4 శాతం వరకూ తగ్గాయి. ఇదే క్రమంలో వెండి ఫ్యూచర్స్ విషయానికి వస్తే మార్చి ఎక్స్ పెయిరీ ఉన్న వాటి రేటు 6 శాతం తగ్గి కేజీ వెండి రూ.2లక్షల 49వేల 713 పలుకుతోంది. ఇది గత గురవారంతో పోల్చితే ఏకంగా 41 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa