ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. భవిష్యత్తులో WPLలో పెట్టుబడులు పెట్టడానికి తమకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇతర క్రీడల్లో కూడా తమ ఫ్రాంచైజీని విస్తరించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం WPLలో ఐదు జట్లు పోటీపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa