ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు గడిగె యువరాజు అప్పుల బాధతో జనవరి 30న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మంగళవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీ. వీ. జయ నాగేశ్వర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన యువరాజు కుటుంబానికి తక్షణమే రూ. 10,000 నగదును అందజేశారు. ప్రభుత్వం తరపున రూ. 50,000 ఆర్థిక సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే యువరాజు కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa