బంగారం మానవ చరిత్రలో వేల ఏళ్లుగా ఆభరణాలు, సంపద, పెట్టుబడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇది తుప్పు పట్టదు, రంగు మారదు. కోట్ల ఏళ్ల క్రితం భూమిపై పడిన గ్రహశకలాలు, ఉల్కల ద్వారా అంతరిక్షం నుంచి భూమికి చేరిన బంగారమే మనం తవ్వుతున్నది. ప్రపంచంలో మొదటి బంగారు నాణేలు క్రీస్తు పూర్వం లిడియా ప్రాంతంలో తయారయ్యాయి. ఆర్థిక సంక్షోభంలో బంగారాన్ని సేఫ్ హావెన్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తారు. ఇప్పుడు ఫిజికల్ బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, సార్వభౌమ గోల్డ్ బాండ్ల రూపంలోనూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.బంగారం ప్రపంచంలో సహజంగా పసుపు రంగులో కనిపించే ఏకైక లోహం. ఇది చాలా బరువైన లోహం కూడా. ఒక క్యూబిక్ ఫీట్ బంగారం అర్ధ టన్నుకు పైగా బరువు ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. ఒక గ్రాము బంగారాన్ని చదరపు మీటర్ పరిమాణంలో పలుచగా చాపవచ్చు. అందుకే అంతరిక్ష దుస్తుల గాజుపై బంగారం పొర వాడతారు. బంగారం వాసన ఉండదు, రుచి ఉండదు, విషపదార్థం కాదు. ఆహారంలో అలంకరణ కోసం కూడా వాడుతారు.