ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 07:19 PM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిబ్రవరి నెలలోకి ప్రవేశించడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముందని, మార్చి నాటికి మరింతగా పెరుగుతాయని వెల్లడించింది. ఏపీలో ఉదయం వేళ పొగమంచు, స్వల్పంగా చలిగాలులు వీస్తుండగా, తెలంగాణలోనూ చలి గాలులు తగ్గిపోయి, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.రాయలసీమ:-మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక:- రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa