ఒత్తిడి, సోషల్ మీడియా వాడకం, ఆలోచనలు, ఇతర వ్యాపకాలు ఇలా కారణాలు ఏవైనా సరే సరైన నిద్ర ఉండట్లేదు చాలా మందికి. చక్కగా నిద్రపోవాలని ట్రై చేసినా ఏవో కొన్ని కారణాల వల్ల మంచి నిద్ర అనేది కరువైపోయింది. దీంతో ఎక్కువ మంది హ్యాపీగా నిద్రపోవడానికి మెడిసిన్స్ వేసుకోవడానికి కూడా వెనుకాడరు. అలాంటి వారు మంచిగా నిద్రపోవాలంటే జీడిపప్పులు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు డాక్టర్ అఖిల. జీడిపప్పులు తీసుకోవడం వల్ల మెడిసిన్ తీసుకున్నట్లుగానే హాయిగా నిద్రపడుతుందని సూచిస్తున్నారు. అందుకోసం జీడిపప్పుల్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నిద్రలేకపోవడం వల్ల వచ్చే సమస్యలు
నిద్రపట్టకపోవడం వల్ల కొన్ని సమస్యలొస్తాయి. మానసిక సమస్యలు వస్తాయి. ఏకాగ్రత తగ్గుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్, ఆందోళనగా ఉంటుంది. దీంతోపాటు ఇమ్యూనిటీ తగ్గుతుంది. బరువు పెరుగుతారు. తలనొప్పి, డార్క్ సర్కిల్స్ పెరుగుతాయి. ముందురోజు సరిగా నిద్రపోకపోతే మరుసటి రోజు చాలా చిరాగ్గా ఉంటుంది. ఏ పనిని సరిగా చేయలేం. కోపం పెరుగుతుంది.
ప్రమాదకర సమస్యలు
ఇదివరకూ చెప్పినవి చిన్నచిన్న సమస్యలే. కానీ, ఎక్కువరోజులు నిద్రలేకపోతే అది ప్రమాదకర సమస్యలుగా మారే అవకాశం ఉంది. గుండె సమస్యలు, డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్, డిప్రెషన్ వంటి ప్రమాద సమస్యలకి కారణంగా మారుతుంది. కాబట్టి, కచ్చితంగా నిద్ర ఉండేలా చూసుకోండి. ఆల్రెడీ సమస్యలు ఉంటే అవి మరింత పెరిగే అవకాశం ఉంది.
జీడిపప్పుల్లోని పోషకాలు
జీడిపప్పుల్లో ట్రిప్టోఫాన్ అనే గుణం ఉంటుంది. ఇది బాడీలో మెలటోనిన్‌ని తయారుచేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనేది నిద్రపోవడానికి హెల్ప్ చేసే హార్మోన్. అంతేకాకుండా, జీడిపప్పుల్లో మెగ్నీషియం, జింక్‌లు ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థని శాంతపరుస్తాయి. అంతేకాకుండా యాంగ్జైటీని తగ్గిస్తాయి.
ఎలా తీసుకోవాలంటే
ఉదయాన్నే నాలుగు నుంచి ఐదు జీడిపప్పుల్ని నీటిలో నానబెట్టాలి. కనీసం 4, 5గంటలైనా నానాలని గుర్తుంచుకోండి. వీటిని రాత్రి పడుకునే గంట ముందు తీసుకోవాలి. ఈ అలవాటు చేసుకుంటే చాలా వరకూ నిద్ర సమస్యలు దూరమవుతాయి. అయితే, ఇవి తినగానే మొదటిరోజు నుంచే నిద్రపడుతుందనుకోవద్దు. కనీసం మంచి రిజల్ట్స్ చూడడానికి 15 రోజులైనా ఫాలో అవ్వండి. ఇలా చేస్తే రోజురోజుకి మీ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది.
నిద్ర సమస్యల్ని దూరం చేసే జీడిపప్పులు
అదే విధంగా
జీడిపప్పులతో పాటు మరికొన్ని అలవాట్లని ఫాలో అవ్వాలి. రోజుకి ఒకే టైమ్‌కి నిద్రపోవడం, ఒకే టైమ్‌కి నిద్రలేవడం చేయాలి.
నిద్రపోయే రూమ్ చల్లగా, తక్కువ వెలుతురు ఉండేలా చూడండి.
పడుకునే రూమ్‌లో గ్యాడ్జెట్స్, టీవీ లేకుండా చూసుకోండి.
ఒకవేళ ఉన్నా కనీసం గంట ముందు నుంచీ వాటిని వాడొద్దు.
పడుకునే ముందు ఏ ఆలోచనలు రానివ్వొద్దు.
వీలైతే ధ్యానం చేయండి. దీంతో చాలా వరకూ మనసు రిలాక్స్ అయి నిద్రపోతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa