ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమీబియాతో జరగనున్న రేపటి ఆటకి అభిషేక్ శర్మ దూరం అవ్వనున్నాడా?

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 02:10 PM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడుపు నొప్పితో బాధపడుతున్న అభిషేక్‌ను సోమవారం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కారణంగా అతడు మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరు కాలేదు. అభిషేక్ పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ధ్రువీకరించారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే నమీబియాతో మ్యాచ్‌లో అతడి లభ్యతపై తుది నిర్ణయం తీసుకుంటామని జట్టు యాజమాన్యం వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa