తన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ప్రచురణపై భారత సైన్యం మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మౌనం వీడారు. తన పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. నా పుస్తక ప్రచురణ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉందంటూ ఆయన 'ఎక్స్' వేదికగా 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా' చేసిన పోస్టును పేర్కొన్నారు.ఈ పుస్తకం కాపీలు ఇంకా ప్రింట్ కాలేదని, డిజిటల్ రూపంలో కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, కాబట్టి ఈ కాపీలు ఎవరికీ ఇవ్వలేదని, విక్రయించలేదని ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పోస్టు చేసింది. దీనిని ఆయన రీపోస్టు చేస్తూ పైవిధంగా స్పందించారు. ఈ పుస్తకం ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదని పెంగ్విన్ ప్రకటన చేసింది.నరవణే రాసిన పుస్తకంపై పార్లమెంటులో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. చైనా భారత భూభాగంలోకి వచ్చిందని ఈ పుస్తకం వెల్లడిస్తోందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa