కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్.. భారతదేశ శత్రువైన పాకిస్థాన్‌ను పొగుడుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే విషయంలో పాకిస్థాన్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాన్ని థరూర్ కొనియాడుతూ కనిపించారు. అయితే తాజాగా ఈ వీడియోపై ఆయన స్పందించారు. ఆ గొంతు, భాష నాది కాదని.. కావాలనే ఎవరో కృత్రిమ మేధ సాయంతో ఈ వీడియోను సృష్టించారని చెప్పారు. తనకు ఈ వీడియోతో ఎలాంటి సంబంధమూ లేదని.. దాన్ని తీక్షణంగా గమనిస్తే ఆ విషయం అందరికీ అర్థం అవుతుందన్నారు.
అసలీ వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఆ వీడియోలో శశి థరూర్ గొంతును పోలిన వాయిస్‌తో కొన్ని సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. "పాకిస్థాన్ దౌత్యపరంగా అద్భుతమైన విజయం సాధించింది. మైదానంలో వారు ఎలా ఆడుతారో తెలియదు కానీ.. దౌత్యపరంగా మాత్రం భారత క్రికెట్ బోర్డు )ని అడ్డంగా బుక్ చేశారు. బలహీనమైన దేశం కూడా తెలివైన దౌత్యంతో రాక్షసుడి లాంటి ప్రత్యర్థిని ఎలా ఓడించవచ్చో పాక్ నిరూపించింది" అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ముఖ్యంగా పాకిస్థానీ సోషల్ మీడియా అకౌంట్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ ప్రచారం చేసుకున్నాయి. దీంతో మన దేశంలోనూ ఈ వీడియో వైరల్ అయింది.
శశి థరూర్ ఘాటు స్పందన..
ఈ వీడియోపై శశి థరూర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. "ఇది కృత్రిమ మేధతో సృష్టించిన నాణ్యత లేని 'ఫేక్ న్యూస్'. అందులో ఉన్న భాష కానీ.. వాయిస్ కానీ నావి కావు" అని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా శశి థరూర్ వాడే ఇంగ్లీష్ పదజాలం, ఆయన ఉచ్ఛారణకు ఏమాత్రం పొంతన లేని విధంగా ఆ ఏఐ వాయిస్ ఉండటాన్ని ఆయన ఎత్తిచూపారు. కావాలనే తాను ఆ దేశాన్ని పొగుడుతున్నట్లు సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని కొట్టిపారేశారు.
రాజీవ్ శుక్లాకు కూడా తప్పని తిప్పలు
కేవలం శశి థరూర్ మాత్రమే కాదు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు సంబంధించి కూడా ఒక ఏఐ వీడియో గతంలో కలకలం రేపింది. కొలంబోలో పాకిస్థాన్ తన బాయ్‌కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై శుక్లా స్పందించినట్లు ఒక పాకిస్థానీ క్రికెట్ షోలో చూపించారు. దానిని కూడా రాజీవ్ శుక్లా ఖండించారు.
అసలీ క్రికెట్ మ్యాచ్ గొడవేంటి?
భారత్‌తో ఆడే విషయంలో మొదట బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించిన పాకిస్థాన్.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆదివారం కొలంబోలో భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్ యథావిధిగా సాగనుంది. ఈ నేపథ్యంలో దౌత్యపరంగా పాకిస్థాన్‌దే పైచేయి అయిందని చూపించే క్రమంలో ఈ నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నారు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని థరూర్ గతంలోనే విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa