భారత సైన్యంలో దేశసేవ చేయాలనుకునే యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అగ్నివీర్ పథకం కింద భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాజాగా అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ దఫా సుమారు 25,000కు పైగా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించడంతో ఆర్మీలో చేరాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. జిడి, టెక్నికల్, క్లర్క్ వంటి పలు విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం జనరల్ డ్యూటీ (GD) మాత్రమే కాకుండా, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు సోల్జర్ ఫార్మా మరియు టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ విభాగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థుల విద్యార్హతను బట్టి అంటే 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు తమకు సరిపోయే పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి విషయానికి వస్తే, అభ్యర్థులు కనీసం 17½ ఏళ్ల నుండి గరిష్టంగా 25 ఏళ్ల లోపు ఉండాలి. అర్హత కలిగిన యువతీ యువకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఏప్రిల్ 1వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసేలోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి తదుపరి దశల్లో శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa