సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్షల అర్హతలపై కీలక క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను రెండు ఎడిషన్లుగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి ఎడిషన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే నేరుగా రెండో ఎడిషన్‌లోనే పరీక్షలు రాయాలంటూ వచ్చిన అభ్యర్థనలను సీబీఎస్సీ తోసిపుచ్చింది. మొదటి ఎడిషన్‌కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. రెండో ఎడిషన్ అనేది మెరుగైన ఫలితాల కోసం అవకాశం మాత్రమేనని తెలిపింది.సీబీఎస్ఈ విద్యార్ధులకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఉదయం షిఫ్ట్ పేపర్లకు ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం అనుమతించబడదని పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. ప్రశ్నాపత్రాలు ఉదయం 10:15 గంటలకు పంపిణీ చేస్తామని, పరీక్ష ఖచ్చితంగా కేటాయించిన వ్యవధి ప్రకారం ముగుస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం అదనపు సమయం ఇస్తారు. పరీక్షా హాలులో విద్యార్థులు సమయాన్ని ట్రాక్ చేయడంలో సాయం చేసేందుకు వివరణాత్మక పరీక్షా రోజు "బెల్ షెడ్యూల్"ను కూడా ఇచ్చారు. కీలక సమయాల్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకమైన, లాంగ్ బెల్ ఉంటుంది. పరీక్షా సమయం ముగియడానికి 10 నిమిషాలు మిగిలి ఉన్నప్పుడు ఒకే బెల్, పరీక్ష ముగింపును సూచించడానికి లాంగ్ బెల్ కొడతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa