ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ ని అగౌరపరిచేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 03:47 PM

కాంగ్రెస్ పార్టీ తీరు దేశానికి తీవ్ర అవమానకరంగా ఉందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శించారు. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం గందరగోళం సృష్టించిందని ఆమె మండిపడ్డారు. దేశ గౌరవాన్ని పక్కనపెట్టి, అంతర్జాతీయ వేదికపై భారత్‌ను అగౌరవపరిచేలా వ్యవహరించిందని ఆరోపించారు.ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. "భారత్ తన సాంకేతిక నాయకత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే సమయంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు సమ్మిట్ వేదిక వద్ద చొక్కాలు విప్పి గందరగోళం సృష్టించారు. అంతర్జాతీయంగా మన దేశాన్ని అవమానించడానికే ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారు," అని పురందేశ్వరి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa