ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు అద్దం పట్టేలా ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవాలి.. ఎలా గెలిపించాలో బ్రూక్ చూయించాడు. పల్లెకెలె వేదికగా జరిగిన సూపర్ 8 కీలక మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఆఖర్లో వరుస వికెట్ల పడటంతో కాసేపు ఇంగ్లండ్ టెన్షన్ పెట్టినా ఆఖరి ఓవర్లో గెలిచింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోవడంతో టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి దాదాపు ఇంటిదారి పట్టినట్టే అని చెప్పొచ్చు. ఇక ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో అధికారికంగా అడుగుపెట్టింది.
సూపర్ 8లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమయినప్పటికీ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ 65 పరుగులతో రాణించడం.. ఆఖర్లో ఫఖర్ జమాన్ 25, షాదాబ్ ఖాన్ 23 పరుగులు బాదడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టును పాక్ పేసర్ షాహీన్ షా అఫ్రిది దెబ్బ కొట్టాడు. తొలి బంతికే ఫిలిప్ సాల్ట్‌ను అవుట్ చేసిన షాహీన్.. వరుస ఓవర్లలో జోస్ బట్లర్, జాకబ్ బేతెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దాంతో ఇంగ్లండ్ పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది. 4.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 35 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
ఆరంభంలోనే వికెట్ పడటంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఎంతో చాకచక్యంగా ఆడాడు. అటాకింగ్ బ్యాటింగ్‌తో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పాక్ బౌలర్లపై ప్రజర్ పెంచి పరుగులు రాబట్టాడు. టామ్ బాంటన్‌తో 23 పరుగులు, సామ్ కరన్‌తో 28 బంతుల్లోనే 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే బ్రూక్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
జట్టు ఒత్తిడిలో ఉన్న ప్రతిసారీ బ్రూక్ బౌండరీ బాదుతూ ఇంగ్లండ్ విజయాన్ని సుగమమం చేశాడు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్.. శతకం బాదిన తర్వాత బంతికే షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే ఇంగ్లండ్ విజయం ఖరారయింది. సామ్ కరన్ అవుటైన తర్వాత విల్ జాక్స్ బ్రూక్‌కి అండగా నిలబడి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. విజయానికి 5 పరుగుల దూరంలో 28 పరుగులు చేసిన జాక్స్ అవుటయ్యాడు. ఆఖర్లో వరుస వికెట్లు పడినా ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 166 పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa