టీ20 ప్రపంచకప్ 2026లో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, ఈ టోర్నీలోనే అత్యధికంగా 256 పరుగుల భారీ స్కోరు చేసి రికార్డు సృష్టించింది.ఈ విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ భారత జట్టును ప్రశంసించాడు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. "తప్పక గెలవాల్సిన మ్యాచ్లు ఆటగాళ్ల స్వభావాన్ని బయటపెడతాయి. 256 పరుగుల భారీ స్కోర్ బాదారు. ఈ ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోరు. మ్యాచ్ ఆద్యంతం జట్టు కనబరిచిన పట్టుదల అద్భుతం. బాగా ఆడారు, ఇదే జోరును తర్వాతి మ్యాచ్లోనూ కొనసాగించండి. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న జింబాబ్వే జట్టుకు కూడా అభినందనలు" అని సచిన్ పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa