హర్మూజ్ జలసంధి వద్ద 700కు పైగా ట్యాంకర్లు చిక్కుకుపోయినట్లు సమాచారం. విండ్వార్డ్, కెప్లెర్ సంస్థల డేటాలో ఈ విషయం వెల్లడైంది. మార్చి 1న ఈ మార్గం నుంచి కేవలం మూడు ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లాయి. మార్చి 2న ఒక్క చిన్న ట్యాంకర్, ఒక కార్గో నౌక మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడైంది. మొత్తం 706 ఇరానేతర ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అంచనా. వీటిలో సుమారు 334 చమురు రవాణా నౌకలు ఉన్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa