రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. ఈ మ్యాచ్‌లో భారత అంపైర్ నితిన్ మెనన్ థర్డ్ అంపైర్‌గా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్‌గా, మరో భారతీయుడైన జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్లో గెలిచిన మ్యాచ్‌కు ఇల్లింగ్‌వర్త్ అంపైర్‌గా వ్యవహరించగా, ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్ ఆడిన మ్యాచ్‌కు వార్ఫ్ అంపైరింగ్ చేశారు. దీంతో అత్యంత కీలకమైన సెమీస్ పోరులకు అనుభవజ్ఞులైన అఫీషియల్స్నే ఐసీసీ నియమించినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa