పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఒకవైపు, ఇరాన్ మరొకవైపు జరుపుతున్న భీకర దాడులతో గల్ఫ్ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది భారత పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా సరే తమ పౌరులను రక్షించుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులకు తక్షణ సాయం అందించేందుకు న్యూఢిల్లీలో స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
అందుబాటులోకి 24/7 సేవలు..
భారతీయుల భద్రత కోసం విదేశాంగ శాఖ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను కేటాయించింది. ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తుందని అధికారులు వెల్లడించారు. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు కింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. ముఖ్యంగా 1800118797 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. అలాగే ఇతర ఫోన్ నంబర్లు.. +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905లకు కూడా ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు.
దేశాల వారీగా అత్యవసర సంప్రదింపు నంబర్లు..
ఉద్రిక్తతలు అధికంగా ఉన్న దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని.. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు కింది నంబర్లను సంప్రదించాల్సిందిగా అధికారులు సూచించారు. ఇజ్రాయెల్‌లోని భారతీయులు +972 54 7520711, +972 54 242837 నంబర్లకు, ఇరాన్‌లోని భారత పౌరులు +98 9128109115, +98 9128109102, +98 9128109109 నంబర్లకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని వాళ్లు.. +971 543090571 (వాట్సాప్), 800 46342 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
అలాగే సౌదీ అరేబియాలోని భారత పౌరులు (రియాద్/జెడ్డా) +966 11 4884697, +966 12 6648660, కువైట్‌లోని వాళ్లు.. +965 65501946, ఒమన్‌లోని భారతీయులు +968 98282270 (వాట్సాప్), 80071234, ఖతార్‌లోని వాళ్లు +974 55647502, బహ్రెయిన్‌లోని ప్రజలు +973 39418071, ఇరాక్‌లోని వాళ్లు +964 771 651 1185 నంబర్లను సంప్రదించవచ్చు.
అప్రమత్తంగా ఉండాలని సూచన..
యుద్ధం కారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం కలగడం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉన్నందున.. భారతీయులు అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. స్థానిక ప్రభుత్వాలు ఇచ్చే భద్రతా సూచనలను తూచా తప్పకుండా పాటించాలని, ఎల్లప్పుడూ పాస్‌పోర్ట్ వంటి కీలక పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎంఈఏ సూచించింది. అవసరమైతే భారతీయులను స్వదేశానికి తరలించడానికి ప్రత్యేక విమానాలను సిద్ధం చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa