పశ్చిమ బెంగాల్లో Mamata Banerjee నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో యువ సాథీ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది.ఈసారి అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర పోటీతో సాగనున్నాయని భావిస్తున్న తరుణంలో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాదు, పథకాన్ని ప్రకటించడమే కాకుండా వెంటనే అమల్లోకి కూడా తీసుకొచ్చింది.రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉద్యోగం లేకుండా ఉన్న 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న యువతకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందించేలా యువ సాథీ పథకాన్ని రూపొందించారు. మొదట ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ, ప్రభుత్వం ముందుగానే అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో అర్హులైన నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభమైంది.పథకం ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం Mamata Banerjee రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం సుమారు 40 శాతం వరకు తగ్గిందని ఆమె తెలిపారు. ఇప్పటికే 40 లక్షల మందికి పైగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చామని గుర్తుచేశారు.ఆ శిక్షణ పొందిన వారిలో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందారని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ సహా పలు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. అయితే కేవలం పదో తరగతి మాత్రమే చదివిన నిరుద్యోగులు వెనుకబడిపోకుండా ఉండేందుకు యువ సాథీ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa