ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బయటకు పరిస్థితి నియంత్రణలో ఉందని చెబుతున్నప్పటికీ, అంతర్గతంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను కూడా పెంచినట్లు వార్తలు వచ్చాయి.హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అక్కడి నుంచి చమురు రవాణా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడానికి 30 రోజులపాటు పరిమిత అనుమతి ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ట్వీట్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.ఈ విషయంపై భారత్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతి అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియాలో స్పందించారు. ట్రంప్‌కు లేఖ రాసినట్టుగా ఒక ట్వీట్ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఆ ట్వీట్‌లో కమల్ హాసన్ ఇలా పేర్కొన్నారు: “ప్రియమైన అధ్యక్షుడికి… మేము భారత ప్రజలు స్వతంత్ర, సార్వభౌమ దేశానికి చెందినవాళ్లం. దూర దేశాల నుంచి వచ్చే ఆదేశాలను మేము అంగీకరించము. కాబట్టి దయచేసి మీ దేశ వ్యవహారాలపైనే దృష్టి పెట్టండి. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచ శాంతికి బలమైన పునాది. మీ దేశానికి, ప్రజలకు శాంతి మరియు శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను.” అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa