ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు అలర్ట్.. పెరగనున్న ఎండలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 03:26 PM

ఏపీలో ఎండల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు లేకపోయినా, వచ్చే నాలుగు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముందని అంచనా వేసింది. ఇప్పటికే ఉదయం నుంచే ఎండ ప్రభావం పెరుగుతుండగా మధ్యాహ్నం వేళ ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa