వివో అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా Vivo Y600 Proను లాంచ్ చేసింది. ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్‌గా 10,200mAh భారీ బ్యాటరీని అందించారు. అలాగే ఇది MediaTek Dimensity 7300e ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది. పనితీరు కోసం ఇందులో ఆక్టా-కోర్ Dimensity 7300e చిప్సెట్తో పాటు ARM Mali-G610 GPUను కూడా అందించారు.కెమెరా విభాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపర్చర్‌తో 50MP ప్రధాన కెమెరా అందించబడింది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 1080p రిజల్యూషన్ వరకు వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.డిస్ప్లే విషయానికి వస్తే, Vivo Y600 Proలో 6.83 అంగుళాల AMOLED స్క్రీన్ ఉంది. ఇది 1,260×2,800 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 449ppi పిక్సెల్ డెన్సిటీ మరియు 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది.కనెక్టివిటీ పరంగా ఇందులో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS మరియు USB Type-C పోర్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అదనంగా గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన హైలైట్ 10,200mAh భారీ బ్యాటరీ. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.ధరల విషయానికి వస్తే, 8GB + 128GB వేరియంట్ ధర సుమారు రూ.29,000గా ఉండగా, 8GB + 256GB ధర సుమారు రూ.31,800గా నిర్ణయించారు. అలాగే 12GB వేరియంట్లు రూ.35,900 నుంచి రూ.40,000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మే 5 నుంచి చైనాలో సేల్కు వస్తుంది.డిజైన్ పరంగా చూస్తే, దీని సైజు 163.9×76.5×8.15mm కాగా, బరువు సుమారు 221 గ్రాములు. ఫ్లోటింగ్ గోల్డ్, స్టార్ వైలెట్, వాస్ట్ బ్లూ, బ్రైట్ మూన్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో ఇది లభించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa