రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ గా రంజిత్ బాషా, IAS ఈ రోజుబాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పూర్వ డైరెక్టర్ శ్రీ.గంధం చంద్రుడు బాషా కి బాధ్యతలను అప్పగించి శాఖ గురించి వివరించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు రంజిత్ బాషా కి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ గా ట్రైకార్ ఎండీ ఈ రవీంద్రబాబు అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హామీల అమలు, గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తామని డైరెక్టర్ శ్రీ.రంజిత్ బాషా, మరియు అడిషనల్ డైరెక్టర్ ఈ రవీంద్ర బాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa