కృష్ణా కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంకా ఎందుకు అక్కడ ఉంటున్నాడో అర్థం కావడం లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. కరకట్టపై చంద్రబాబు తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. తానైతే ఆ ఇంట్లో అసలు ఉండేవాడిని కాదని తేల్చి చెప్పారు. ఆ నిర్మాణాన్ని ప్రభుత్వం కూల్చి వేస్తే బాబు సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో ప్రజాధనం ఆదా చేయడం మంచి విషయమని ప్రశంసించారు. అయితే ఈ విధానంతో అవినీతిని ఏ రకంగా ఆదా చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా చౌదరి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa