కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం శివకుమార్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు శివకుమార్‌ను ఈ నెల 3న అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. తాజాగా బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో శివకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అజెయ్ కుమార్ కుహార్ నేతృత్వంలో ధర్మాసనం.. శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa