ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 10నుండి వైఎస్సార్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. 5 దశల్లో అమలు కానున్న ఈ పథకం మొత్తంలో ఒకటి, రెండు దశల్లో స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. మూడు, నాలుగు, ఐదు విడతల్లో కమ్యూనిటీ బేస్‌గా కంటి పరీక్షలు జరగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలు పనిచేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa