గోవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలుతో పాటు స్నేహితురాలిని ఓ రష్యా వ్యక్తి దారుణంగా చంపాడు. రష్యా జాతీయుడైన అలెక్సీ లియోనోవ్(37), జనవరి 14న మోర్జిమ్లోని అద్దె ఇంట్లో ఉంటున్న స్నేహితురాలు ఎలెనా వనీవా(37)ను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అరమ్బోల్ గ్రామానికి అలెక్సీ చేరుకున్నాడు. జనవరి 15న తనతో కలిసి ఉంటున్న ప్రియురాలు ఎలెనా కస్థానోవానతో అతడు గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి గదిలో బంధించాడు. అయితే ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా కత్తితో గొంతు కోసి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa