గోవా విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం టేకాఫ్ అయిన తరువాత ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో తిరిగి గోవాలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో 180 మంది ప్రయాణీకులు ఉన్నారు. గోవా పర్యావరణ శాఖ మంత్రి నీలేశ్ కాబ్రల్ కూడా విమానంలో ప్రయాణిస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన 15 నిముషాల తరువాత విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగాయని, దీనిని గమనించిన పైలట్ వెంటనే ఆ ఇంజన్‌ను ఆఫ్ చేశారని మంత్రి కాబ్రల్ చెప్పారు. విమానాన్ని తిరిగి గోవాలోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa