భారీ ఆఫర్లు ప్రకటిస్తూ పోటీదారులకు చుక్కలు చూపిస్తున్న జియో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే కాల్స్, డేటా, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలను చవక ధరలకే అందిస్తున్న జియో సామాన్యుడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలనే లక్ష్యంతో మరిన్ని వరాలు కురిపిస్తుంది. దసరా, దీపావళి ఆఫర్లను దృష్టిలో పెట్టుకుని జియో ఫోన్ ను తక్కువ ధరకే అందించేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు 1500కు అమ్ముతున్న జియో ఫోన్ ను కేవలం రూ.699కే అందించనుంది. దీనికోసం పాత ఫోన్ ను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పస్టం చేసింది. కాబట్టి నేరుగా రూ.699 చెల్లించి కొత్త ఫోన్ పొందవచ్చని మంగళవారం జియోసంస్థ అధికారికంగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.