ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలతో దెబ్బతిన్న ట్రాక్ సర్క్యూట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 08:06 AM

భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ యార్డ్‌లో నీరు నిలిచిపోయి ట్రాక్ సర్క్యూట్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో నేడు బెర్హంపూర్-విశాఖపట్టణం మధ్య నడవాల్సిన ప్యాసింజర్ (58525) రైలు, విశాఖలో నిన్న బయలుదేరాల్సిన విశాఖపట్నం-భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌(22820), నేడు భువనేశ్వర్‌లో బయలుదేరాల్సిన భువనేశ్వర్‌-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(22819)లను రద్దు చేసినట్టు తెలిపారు. అలాగే, నిన్న విశాఖలో బయలుదేరాల్సిన విశాఖపట్నం-బెర్హంపూర్‌ పాసింజర్‌ (58526)రైలును కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. జగదల్‌పూర్‌-భువనేశ్వర్‌ మధ్య నడిచే హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ (18448) రైలును రీషెడ్యూల్‌ చేసినట్టు వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa