కేంద్రప్రభుత్వంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఫైర్ అయ్యారు. కర్ణాటకలో కలస- బందూరి ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో బెళగావి, ధార్వాడ్, గడగ్ జిల్లాలకు తాగు నీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. తాజాగా దీనిపై కేంద్రం సానుకూల వైఖరి వ్యక్తం చేసింది. దీని కారణంగా గోవాలోని అటవీ, జంతు సంరక్షణకు ఆటంకం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు పలువురు పర్యావరణ ప్రేమికులు మద్దతు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తో మాట్లాడనన్నారు. ఈ ప్రాజెక్టుకు మద్దతు తెలపడంతో కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉన్నందున వెనక్కి తీసుకోవాలని లేదంటే ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోడీని కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలని కోరుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa