ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి గుంతలో పడిన ఏనుగు.. వీడియో వైరల్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 03:25 PM

భువనేశ్వర్ లోని సుందర్‌ఘర్ జిల్లాలోని దుమెత్రా గ్రామానికి సమీపంలోని ఓ నీటి గుంతలో ఆడ ఏనుగు పడిపోయింది. అడవుల్లో నుంచి గ్రామంలోకి వచ్చిన ఏనుగును మళ్లీ అడవిలోకి పంపేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా అది నీటి గుంతలో పడిపోయింది. అయితే ఏనుగు నీటి గుంతలోని బురదలో చిక్కుకుపోయింది. ఆ ఏనుగును బయటకు తీసేందుకు గ్రామస్తులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వారు అగ్నిమాపక సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. స్థానికుల సహాయంతో ఏనుగుకు తాళ్లు కట్టి నెమ్మదిగా బయటకు తీశారు. ఆ తర్వాత ఏనుగు అరుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియో మీ కోసం...






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa