ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేడియంలో ఆటగాళ్లకు శీతల పానీయాలు అందించిన ప్రధాని

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 08:50 PM

ఆస్ట్రేలియా ప్రధాని తనకు క్రికెట్ పై ఎంత మక్కువో తాజాగా నిరూపించారు. క్రికెట్‌పై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. మైదానంలో ఆసీస్‌ ఆటగాళ్లకు శీతల పానీయాలను అందించి ఆ దేశ ప్రధాని మోరిసన్‌ శెభాష్‌ అనిపించుకున్నారు. మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు శ్రీలంక జట్టు ఆసీస్‌కు విచ్చేసింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా ప్రైమ్‌ మినిష్టర్‌ ఎలెవెన్‌తో శ్రీలంక జట్టు తలపడింది. మ్యాచ్‌లో దసున్‌ శనక వికెట్‌ కోల్పోగానే ఆ దేశ ప్రధాని మోరిసన్‌ శీతల పానీయాల పెట్టెతో మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు పానీయాలు అందించారు. అంతేగాక వారితో కరచాలనాలు కూడా చేశారు. ఈ మ్యాచ్‌లో ప్రైమ్‌ మినిస్టర్‌ జట్టు వికెట్‌ తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa